Ali Khamenei: అగ్రనేత మృతితో అట్టుడుకుతున్న ఇరాన్.. మసీదుపై 'ప్రతీకార ఎర్రజెండా'

Ali Khamenei Death Sparks Tensions in Iran Red Flag Raised
  • అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి
  • ప్రతీకారానికి చిహ్నంగా మసీదుపై ఎర్ర జెండా ఎగరేసిన ఇరాన్
  • పాలన కోసం ముగ్గురు సభ్యులతో అత్యున్నత మండలి ఏర్పాటు
  • మధ్యప్రాచ్యంలో తారాస్థాయికి చేరిన యుద్ధ వాతావరణం
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడిలోనే ఆయన మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామంతో ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్, ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిన బూనుతూ క్వామ్ నగరంలోని పవిత్ర జామ్‌కరాన్ మసీదుపై 'ఎర్ర జెండా'ను ఎగురవేసింది.

ఖమేనీ మరణంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. "చరిత్రలోనే అత్యంత దుష్టులలో ఒకరైన వ్యక్తి అంతమయ్యాడు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి ఇది ఒకేఒక గొప్ప అవకాశం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. నెతన్యాహు కూడా ఖమేనీని ఒక నియంతగా అభివర్ణిస్తూ ఇరాన్ ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు.

మరోవైపు, ఖమేనీ ఆకస్మిక మరణంతో దేశంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా ఇరాన్ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకునేంత వరకు పాలనను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన అత్యున్నత మండలిని ఏర్పాటు చేసింది. ఈ మండలిలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, చీఫ్ జస్టిస్ ఎజీ, క్లారిక్ సభ్యుడు అలీరెజా అరాఫీ ఉన్నారు.

షియా సంప్రదాయం ప్రకారం ఎర్ర జెండాను ఎగురవేయడం అంటే అన్యాయంగా చిందిన రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేయడమే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 రోజుల సంతాప దినాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
Ali Khamenei
Iran
Supreme Leader
Red Flag
Qom
Jamkaran Mosque
Donald Trump
Benjamin Netanyahu
Middle East
Tensions

More Telugu News