Nara Lokesh: 'హెరిటేజ్ నెయ్యి రేటు ఎంత? అది కూడా కల్తీనేనా?': లోకేశ్ కు బొత్స సూటి ప్రశ్న

Nara Lokesh Heritage Ghee Price Questioned by Botsa
  • వెయ్యి రూపాయల లోపు దొరికితే కల్తీ నెయ్యి అని లోకేశ్ అంటున్నారన్న బొత్స
  • హెరిటేజ్ వెబ్‌సైట్‌లో లీటర్ ఆవు నెయ్యి ధర కేవలం రూ. 608గా ఉందని వ్యాఖ్య
  • మీరు అమ్ముతున్న నెయ్యి కూడా కల్తీనేనా అని ప్రశ్న

తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యలపై శాసనమండలిలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. "వెయ్యి రూపాయల లోపు దొరికితే కల్తీ అని లోకేశ్ చెబుతున్నారు. మరి హెరిటేజ్ వెబ్‌సైట్‌లో లీటర్ ఆవు నెయ్యి ధర కేవలం రూ. 608గా ఉంది. రిలయన్స్ వంటి మార్కెట్లలో 750 ఎంఎల్ నెయ్యి రూ. 456కే దొరుకుతోంది. లోకేశ్ లెక్కల ప్రకారం చూస్తే మరి మీరు అమ్ముతున్న నెయ్యి కూడా కల్తీనేనా?" అని బొత్స ప్రశ్నించారు. 


అంతేకాకుండా, హెరిటేజ్ వెబ్‌సైట్‌లో తయారీదారుల వివరాలను (మాన్యుఫ్యాక్చరర్ నుంచి కో-మ్యాన్యుఫ్యాక్చరర్‌గా) ఎందుకు మార్చాల్సి వచ్చిందో లోకేశ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మొదట ఇందాపూర్‌ని మాన్యుఫాక్చరర్ అని చెప్పారని... ఆ తర్వాత కో-మాన్యుఫాక్చరర్ అని ఎందుకు మార్చారని ప్రశ్నించారు.


టీడీపీ ఎమ్మెల్సీలు సంబంధం లేని పాత అంశాలను తెరపైకి తెస్తున్నారని బొత్స విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి మరణం గురించి ప్రస్తావించడాన్ని ఖండిస్తూ.. "వైఎస్సార్ తన తండ్రిని చంపిన వారిపై కక్ష తీర్చుకుని ఉంటే, ఈరోజు పరిస్థితి ఇలా ఉండేదా? సభలో చర్చకు సంబంధం లేని వ్యక్తిగత దాడులు చేయడం సరికాదు" అని మండిపడ్డారు.

Nara Lokesh
Heritage ghee
Botsa Satyanarayana
Tirumala laddu
ghee adulteration
Andhra Pradesh politics
YS Rajasekhara Reddy
TDP
YSRCP

More Telugu News