Narendra Modi: దేశంలోనే ఫాస్టెస్ట్ మెట్రో.. మీరట్‌లో సరికొత్త రికార్డు!
- మీరట్‌లో రూ.12,930 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని
- పూర్తిస్థాయిలో అందుబాటులోకి ఢిల్లీ-మీరట్ నమో భారత్ కారిడార్
- దేశంలోనే అత్యంత వేగవంతమైన మీరట్ మెట్రో సేవలకు శ్రీకారం
- ఢిల్లీ నుంచి మీరట్‌కు కేవలం 58 నిమిషాల్లోనే ప్రయాణం
- ఒకే ట్రాక్‌పై రీజినల్ రైలు, మెట్రో నడపడం దేశంలో ఇదే తొలిసారి
ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మీరట్‌లో పర్యటించి సుమారు రూ.12,930 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా 82 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ‘నమో భారత్’ రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్‌ను పూర్తిస్థాయిలో జాతికి అంకితం చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ‘మీరట్ మెట్రో’ సేవలను కూడా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం శతాబ్ది నగర్ స్టేషన్ నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. తాజా ప్రారంభోత్సవంతో ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్ నుంచి మీరట్‌లోని మోదీపురం వరకు ప్రయాణ సమయం కేవలం 58 నిమిషాలకు తగ్గనుంది. ఇంతకుముందు ఈ ప్రయాణానికి దాదాపు మూడు గంటల సమయం పట్టేది.
గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మీరట్ మెట్రో, దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో వ్యవస్థగా నిలవనుంది. మరో విశేషమేమిటంటే, ఒకే రైల్వే ట్రాక్‌పై రీజనల్ రైలు (నమో భారత్), లోకల్ మెట్రో (మీరట్ మెట్రో) నడవడం దేశంలో ఇదే తొలిసారి. ఈ కొత్త విధానం పట్టణ రవాణా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రద్దీ తగ్గడంతో పాటు పర్యావరణ హితమైన రవాణాకు మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం తెలిపింది.