Buggana Rajendranath Reddy: అప్పు ఎంత ఉందో చెప్పలేదు: బడ్జెట్ పై బుగ్గన విమర్శలు

Buggana Rajendranath Reddy Criticizes Budget for Not Disclosing Debt
  • బడ్జెట్ స్పీచ్ లో అన్నీ అబద్ధాలే చెప్పారన్న బుగ్గన
  • గత బడ్జెట్ బుక్ ను మళ్లీ చదివినట్టు ఉందని వ్యాఖ్య
  • వైసీపీ హయాంలో 9 శాతం వృద్ధి సాధించామని వెల్లడి
ఏపీ శాసనసభలో ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై వైసీపీ నేత, రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ స్పీచ్ లో అన్నీ అబద్ధాలే చెప్పారని విమర్శించారు. అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం పెద్ద నేరమని అన్నారు. ఈ బడ్జెట్ లో కొత్తదనం ఏమీ లేదని... గత బడ్జెట్ బుక్ ను మళ్లీ చదివినట్టే ఉందని చెప్పారు. రాష్ట్ర అప్పు ఎంత ఉందో చెప్పలేదని విమర్శించారు. 

తమ ప్రభుత్వ హయాంలో 9 శాతం వృద్ధి సాధించామని బుగ్గన చెప్పారు. లక్ష 35 వేల మంది యువతకు ఉపాధి కల్పించామని తెలిపారు. మొత్తం 10,032 విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేశామని చెప్పారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రూ. 3,700 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. 10,775 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 


Buggana Rajendranath Reddy
Andhra Pradesh Budget 2024
AP Assembly
Payyavula Keshav
YSRCP
Andhra Pradesh Economy
Village Clinics
Rythu Bharosa Kendram

More Telugu News