India Pakistan match: కొలంబోలో భారత్-పాక్ 'బిగ్ ఫైట్': మ్యాచ్‌కు వర్షం గండం

India Pakistan T20 World Cup match rain threat in Colombo
షార్ట్స్‌లో చూడండి
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా రేపు (ఫిబ్రవరి 15) చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న హైవోల్టేజ్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరగనున్న ఈ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఈ బిగ్ మ్యాచ్ సజావుగా సాగుతుందా? లేదా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ ఆందోళనలు మొదలయ్యాయి. "15వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది" అని వాతావరణ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఈ అల్పపీడన ప్రభావంతో కొలంబోలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు, ప్రముఖ వాతావరణ సంస్థ అక్యూవెదర్ నివేదిక ప్రకారం.. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు సాయంత్రం 5 గంటలకు జల్లులు పడే అవకాశం ఉంది. అయితే, మ్యాచ్ సమయంలో వర్షం పడే సూచనలు తక్కువేనని తెలిపింది. ఆట జరిగేటప్పుడు వాతావరణం మేఘావృతమై, ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా.

ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్ జట్లు ఓటమి లేకుండా దూసుకెళ్తున్నాయి. సూపర్-8 దశకు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు అత్యంత కీలకం. అమెరికా, నమీబియాలపై గెలిచి భారత్ మంచి ఫామ్‌లో ఉండగా.. నెదర్లాండ్స్, అమెరికాలపై విజయాలతో పాకిస్థాన్ కూడా బలంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లలో ఇరు జట్లు 8 సార్లు తలపడగా, భారత్ 7-1 ఆధిక్యంలో ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, ఇరు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది.
Go Back to Shorts
India Pakistan match
T20 World Cup
Colombo weather
Rain forecast
R Premadasa Stadium
India vs Pakistan
Cricket match
Weather report
T20 World Cup 2024

More Telugu News