Battini Ellamma: కౌంటింగ్‌కు ముందు విషాదం.. బీజేపీ అభ్యర్థి మృతి!

Battini Ellamma BJP Candidate Dies Before Counting in Telangana
  • కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
  • లక్షెట్టిపేట 10వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎల్లమ్మ మృతి
  • శోకసంద్రంలో మునిగిపోయిన వార్డు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 3 నుంచి 8 రౌండ్లలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ప్రధాన పార్టీల ప్రతిష్ఠకు ఈ ఎన్నికల ఫలితాలు అత్యంత కీలకం కావడంతో... అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 

మరోవైపు, ఎన్నికల కౌంటింగ్ రోజున ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా నుంచి షాకింగ్ వార్త వచ్చింది. లక్షెట్టిపేట 10వ వార్డు బీజేపీ అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ అనారోగ్య కారణాలతో మృత్యువాత పడింది. కౌంటింగ్‌కు ముందే జరిగిన ఈ దుర్ఘటన ఆ వార్డును శోక సంద్రంలో ముంచెత్తింది.  

Battini Ellamma
Telangana Municipal Elections
BJP
Lakshettipet
Mancherial District
Municipal Elections Counting
Telangana Elections
Ward 10
Election Results

More Telugu News