DGP Office: మక్తల్ అభ్యర్థి ఆత్మహత్య... డీజీపీ ఆఫీసును ముట్టడించిన బీజేపీ

BJP Protests at DGP Office Over Maktal Candidate Mahadevappa Suicide
  • డీజీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత
  • బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు
  • తోపులాట జరగడంతో పలువురికి గాయాలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ మక్తల్ లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడడంపై ఆ పార్టీ ఆందోళన చేపట్టింది. మహదేవప్ప మృతికి కాంగ్రెస్ పార్టీ నేతలే కారణమని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు హైదరాబాదులో డీజీపీ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, నేతలు చేరుకోవడంతో డీజీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. 

పోలీసులు బారికేడ్లతో వారిని అడ్డుకునేందుకు యత్నించారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. బారికేడ్లను తోసుకుంటూ డీజీపీ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటుచేసుకుంది. ఖైరతాబాద్‌ డీసీపీ శిల్పవల్లి కిందపడిపోయారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.
DGP Office
Mahadevappa
Maktal
BJP
Telangana BJP
Suicide
Municipal Elections
Congress Party
Protest

More Telugu News