Heritage Foods: తప్పుడు వార్తలను నమ్మవద్దు.. వినియోగదారులకు హెరిటేజ్ ఫుడ్స్ విజ్ఞప్తి
- తమ పెరుగు నాణ్యతపై వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించిన హెరిటేజ్ ఫుడ్స్
- హర్యానాలో శాంపిల్ సేకరణ ప్రక్రియలో అధికారులు నిబంధనలు పాటించలేదని ఆరోపణ
- విధించిన జరిమానాపై అప్పీల్‌కు వెళ్లామని, ట్రైబ్యునల్ స్టే ఇచ్చిందని వెల్లడి
- విషయం కోర్టు పరిధిలో ఉన్నందున జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదన్న సంస్థ
- తప్పుడు కథనాలతో కంపెనీ ప్రతిష్టను దెబ్బతీయవద్దని విజ్ఞప్తి
తమ పెరుగు ఉత్పత్తుల నాణ్యతపై మీడియాలో, ముఖ్యంగా సాక్షి పత్రికలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ తీవ్రంగా ఖండించింది. హర్యానాలో తమ ఉత్పత్తికి సంబంధించి విధించిన జరిమానాను ఆధారంగా చేసుకుని, అసంపూర్ణ వివరాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు ఆదివారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు తమ వివరణను ప్రచురించాలని సాక్షి యాజమాన్యాన్ని ఇప్పటికే కోరినట్లు కంపెనీ స్పష్టం చేసింది.
హెరిటేజ్ ఫుడ్స్ తెలిపిన వివరాల ప్రకారం, హర్యానాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తమకు 2025, డిసెంబర్ 18న జారీ చేసిన నోటీసును తాము 2025, డిసెంబర్ 31న అందుకున్నామని, దానిని సవాలు చేస్తూ గురుగ్రామ్‌లోని ఫుడ్ సేఫ్టీ అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో అప్పీల్ దాఖలు చేశామని పేర్కొంది. తమ వాదనలతో ఏకీభవించిన ట్రైబ్యునల్, ఆ నోటీసుపై స్టే విధించిందని తెలిపింది. ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున (సబ్ జుడీస్), మీడియాలో ప్రచారం అవుతున్నట్లుగా జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని, అది నిలుపుదలలో ఉందని స్పష్టం చేసింది. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా తాము కార్పొరేట్ పాలన, పారదర్శకత, నియంత్రణ సంస్థల నిబంధనలకు కట్టుబడి ఉంటామని ఉద్ఘాటించింది.
శాంపిల్ సేకరణలోనే లోపం జరిగింది
అసలు ఈ వివాదానికి కారణమైన శాంపిల్ సేకరణ ప్రక్రియలోనే అధికారులు తీవ్రమైన తప్పిదాలకు పాల్పడ్డారని హెరిటేజ్ ఆరోపించింది. పాలు, పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తుల నుంచి శాంపిల్స్ సేకరించేటప్పుడు, అవి ఏకరీతిగా ఉండేలా (homogeneity) బాగా కలిపి లేదా చిలికి శాంపిల్ తీసుకోవాలని, కానీ అధికారులు ఆ నిబంధనను పాటించలేదని కంపెనీ తెలిపింది. ఈ విషయాన్ని పంచనామాలో గానీ, ఫారం V-Aలో గానీ నమోదు చేయలేదని పేర్కొంది. అంతేకాకుండా, స్వతంత్ర సాక్షుల వివరాలు లేకపోవడం కూడా ప్రక్రియలోని తీవ్రమైన లోపమని, దీనివల్ల మొత్తం శాంపిలింగ్ ప్రక్రియే నీరుగారిపోయిందని వాదించింది.
సరిగ్గా కలపకపోవడం వల్ల కొవ్వు పైకి తేలి, వాస్తవ ఉత్పత్తికి భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని హెరిటేజ్ వివరించింది. ప్రయోగశాల నివేదికలో సైతం కొవ్వు రహిత ఘనపదార్థాల (SNF) మోతాదు నిర్దేశించిన ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉందని, దీన్నిబట్టి చూస్తే కొవ్వును తగ్గించి వాణిజ్య ప్రయోజనం పొందాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టమవుతోందని కంపెనీ వాదించింది. నిల్వ చేసే పరిస్థితులు, రవాణా, షెల్ఫ్ లైఫ్ వంటి కారణాల వల్ల కొన్నిసార్లు విశ్లేషణలో చిన్న చిన్న తేడాలు రావొచ్చని, అయితే తమ ఉత్పత్తిలో ఎలాంటి హానికరమైన పదార్థాలు లేవని, ప్రజారోగ్యానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని నివేదికలోనే తేలిందని గుర్తుచేసింది.
గత 33 ఏళ్లుగా లక్షలాది మంది రైతులు, వేలాది మంది ఉద్యోగులు, ఫ్రాంచైజీలు, పంపిణీదారుల నిరంతర కృషితో హెరిటేజ్ బ్రాండ్‌ను ఉన్నత ప్రమాణాలతో నిర్మించామని కంపెనీ పేర్కొంది. సుమారు పదివేల గ్రామాల్లో పాడి రైతుల జీవనోపాధికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తమ సంస్థ అండగా నిలుస్తోందని తెలిపింది. ఇలాంటి తప్పుడు, అసంపూర్ణ, దురుద్దేశపూర్వక కథనాలను నమ్మవద్దని, తమ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే వార్తల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెరిటేజ్ ఫుడ్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జె. సాంబమూర్తి విజ్ఞప్తి చేశారు.