Harley Davidson: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఎఫెక్ట్... తగ్గనున్న హార్లే డేవిడ్సన్ బైకుల ధరలు!
- అమెరికా నుంచి దిగుమతయ్యే మోటారు సైకిళ్లపై సుంకం తగ్గించినట్లు ప్రకటించిన భారత్
- 800 సీసీ నుంచి 1600 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైక్‌లపై ఇకపై ఎలాంటి దిగుమతి సుంకాలు ఉండబోవని వెల్లడి
- అమెరికా ప్రీమియం బైక్ తయారీ సంస్థ హార్లే డేవిడ్‌సన్‌కు భారీ ఊరట
అమెరికా నుంచి దిగుమతయ్యే మోటారు సైకిళ్లపై భారత్ భారీగా సుంకాలను తగ్గించింది. భారత్ - అమెరికా మధ్య ఎట్టకేలకు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 800 సీసీ నుంచి 1600 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైక్‌లపై ఇకపై ఎలాంటి దిగుమతి సుంకాలు ఉండబోవని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో అమెరికా ప్రీమియం బైక్ తయారీ సంస్థ హార్లే డేవిడ్‌సన్‌కు ఈ ఒప్పందం పెద్ద ఊరటగా మారనుంది.
ఇదివరకే హార్లే డేవిడ్‌సన్‌కు ప్రభుత్వం సుంకాల విషయంలో కొంత వెసులుబాటు కల్పించింది. గతేడాది 1600 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం కలిగిన వాహనాలపై 50 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 40 శాతానికి తగ్గించింది. అలాగే 1600 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న వాహనాలపై 50 శాతం సుంకాన్ని 30 శాతానికి కుదించింది. ఇక తాజాగా కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై భారత్ - అమెరికా ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. దీనిపై మార్చిలో అధికారికంగా సంతకాలు జరగనున్నాయి. ఒప్పందం అమలులోకి వచ్చిన తేదీ నుంచే కొత్త సుంకాల విధానం అమల్లోకి రానుంది.
అమెరికా నుంచి దిగుమతయ్యే కార్లపై కూడా భారత్ సుంకాలను తగ్గించింది. 3000 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన పెట్రోల్, డీజిల్ వాహనాలపై 10 సంవత్సరాల పాటు 30 శాతం చొప్పున సుంకం వర్తించనుంది. అయితే ఎలక్ట్రిక్ కార్లను ఈ ట్రేడ్ డీల్ నుంచి మినహాయించారు. దీంతో టెస్లాకు ఈసారి పెద్దగా ఊరట లభించలేదు. టెస్లా విక్రయిస్తున్న మోడల్ వై కార్లపై టారిఫ్‌లు యథాతథంగా కొనసాగనున్నాయి. ఇది దేశీయ ఆటోమొబైల్ కంపెనీలైన టాటా, మహీంద్రాలకు మాత్రం ఊరట కలిగించే అంశంగా భావిస్తున్నారు.