Arjun Sarja: మోసపోయింది ఎక్కువ .. కూడబెట్టింది తక్కువ: సీనియర్ హీరో అర్జున్

Arjun Interview
  • దర్శకుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ 
  • హీరోయిన్ గా ఆయన కూతురు ఎంట్రీ
  • ఈ నెల 14న విడుదలవుతున్న 'సీతా పయనం'
  • శోభన్ బాబుగారి మాట వినలేదన్న అర్జున్  

అర్జున్ కి యాక్షన్ కింగ్ గా అటు కోలీవుడ్ లోను .. ఇటు టాలీవుడ్ లోను మంచి క్రేజ్ ఉంది. ఆరంభంలో అర్జున్ చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో ఆయన హీరోగా నిలబడ్డారు. ఆ తరువాత అలాంటి విజయాలు అనేకం ఆయన ఖాతాలోకి చేరిపోయాయి. అలాంటి అర్జున్ సుదీర్ఘమైన కెరియర్ తరువాత, తన కూతురు ఐశ్వర్య కథానాయికగా 'సీతా పయనం' అనే సినిమాను తెరకెక్కించారు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను  విడుదల చేస్తున్నారు. 

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అర్జున్ 'గ్రేట్ ఆంధ్ర'కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "తెలుగులో నేను చేసిన మొదటి సినిమాకిగాను పారితోషికంగా అందుకున్నది పాతికవేలు. నేను ప్లాన్ చేసుకోలేదు గానీ నా కెరియర్ గ్రాఫ్ చాలా బాగా వెళ్లింది. చాలా చిన్న వయసులోనే ఎక్కువ డబ్బు వచ్చేసింది. అప్పట్లో ఆ డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది కూడా నాకు తెలియలేదు" అని అన్నారు. 

"ఎవరూ .. ఏమిటనేది నేను చెప్పను గానీ, నా చుట్టూ ఉన్నవారే నన్ను మోసం చేశారు. అందువలన నేను చాలా నష్టపోయాను. ఆ ప్రాపర్టీస్ ఈ రోజున ఉంటే నేను మరో రేంజ్ లో ఉండేవాడిని. శోభన్ బాబు గారు నాకు చాలా క్లోజ్. నాతో ఉన్నంత చనువుగా ఆయన ఎవరితోనూ ఉండేవారు కాదు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు కూడా. ఆయన ఎన్నో సలహాలు ఇచ్చేవారు. కానీ అప్పుడు నాకు అవి ఎక్కలేదు" అని చెప్పారు. 

Arjun Sarja
Action King Arjun
Seetha Payanam
Aishwarya Arjun
Telugu cinema
Kollywood
Sobhan Babu
Movie promotions
Film career
Investment losses

More Telugu News