ఏపీ హైకోర్టులో 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన అంబటి రాంబాబు
- చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై 7 కేసులు నమోదు
- అన్ని కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్లు వేసిన అంబటి
- నల్లపాడు పీఎస్ లో నమోదైన కేసుకు సంబంధించిన విచారణను ఈ నెల 11కు వాయిదా వేసిన హైకోర్టు
ఇప్పటికే నల్లపాడు పీఎస్ లో నమోదైన కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్ పై విచారణను ఈ నెల 11వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. మంగళగిరి పీఎస్ లో నమోదైన కేసులో తప్పనిసరిగా బీఎన్ఎస్ 35(3)ను అనుసరించాలని మంగళగిరి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
మిగిలిన 5 కేసులకు సంబంధించిన క్వాష్ పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్వాష్ పిటిషన్లపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
మరోవైపు, అంబటిపై పీటీ వారెంట్ పొందేందుకు మంగళగిరి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.