Lucky Oberoi: పంజాబ్‌లో 'ఆప్' నేత కాల్చివేత.. గురుద్వారా బయటే బుల్లెట్ల వర్షం!
- కారులో ఉండగానే లక్కీ ఒబెరాయ్‌పై కాల్పులు
- పక్కా ప్లాన్‌తోనే దుండగుల అటాక్
- పంజాబ్‌లో శాంతిభద్రతలపై విపక్షాల విమర్శలు
పంజాబ్‌లో పట్టపగలే గన్ కల్చర్ మరోసారి కలకలం రేపింది. జలంధర్‌లోని అత్యంత రద్దీగా ఉండే మోడల్ టౌన్ ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత లక్కీ ఒబెరాయ్ దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం స్థానిక గురుద్వారా సాహిబ్ వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. తన కారులో కూర్చుని ఉన్న ఒబెరాయ్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించారు. దాదాపు ఐదు బుల్లెట్లు ఆయన శరీరంలోకి దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు.
లక్కీ ఒబెరాయ్ ప్రతిరోజూ ఉదయం గురుద్వారాను సందర్శించడం ఆనవాయితీ. దుండగులు ఆయన దినచర్యను ముందే గమనించి, పక్కా ప్లాన్‌తో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కారు ఎక్కుతున్న సమయంలోనే ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఒబెరాయ్ భార్య గతంలో 'ఆప్' తరఫున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. రాజకీయ కారణాలా? లేక పాత కక్షలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పంజాబ్‌లో గత కొన్ని రోజులుగా రాజకీయ నేతలు, సర్పంచ్‌ల లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెలలోనే అమృత్‌సర్‌లో ఒక వివాహ వేడుకలో మరో 'ఆప్' నేత హత్యకు గురయ్యారు. తాజాగా జలంధర్ నడిబొడ్డున జరిగిన ఈ హత్యపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్, అకాలీదళ్ విమర్శిస్తున్నాయి. కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.