UAE Big Ticket Lottery: కర్ణాటక యువకుడికి యూఏఈలో జాక్‌పాట్.. లాటరీలో రూ.49 కోట్లు!

Shantanu Shettigar Wins 49 Crore Rupees in UAE Lottery
  • ఉడిపి జిల్లాకు చెందిన శంతను శెట్టిగర్‌కు రూ.49 కోట్ల ప్రైజ్ మనీ
  • స్నేహితుడితో కలిసి కొన్న టికెట్‌కు తగిలిన బహుమతి
  • డబ్బును ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదన్న విజేత
కర్ణాటకకు చెందిన ఓ యువకుడికి అదృష్టం తలుపుతట్టింది. యూఏఈలోని అబుదాబిలో నిర్వహించిన ప్రఖ్యాత ‘బిగ్ టికెట్’ లక్కీ డ్రాలో ఏకంగా 20 మిలియన్ దిర్హమ్స్ (దాదాపు రూ.49 కోట్లు) గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఉడిపి జిల్లా కటపాడి మట్టుకు చెందిన శంతను శెట్టిగర్ ఈ భారీ మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం ఒమన్‌లో రిటైల్ రంగంలో పనిచేస్తున్న ప్రవాస భారతీయుడైన శంతను, సిరీస్ 283లో భాగంగా 305810 నంబర్ గల టికెట్‌ను కొనుగోలు చేశాడు. డ్రాను ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా, నిర్వాహకులు శంతనుకు ఫోన్ చేసి ఈ శుభవార్తను తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది చూస్తుండగా తనకు జాక్‌పాట్ తగిలిందని తెలిసి అతను ఆనందంలో మునిగిపోయాడు.

ఈ సందర్భంగా నిర్వాహకులతో ఫోన్‌లో మాట్లాడిన శంతను, "ఈ విజయం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఈ డబ్బుతో ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు" అని చెప్పాడు. ఈ టికెట్‌ను తాను స్నేహితుడితో కలిసి కొన్నానని, నిబంధనల ప్రకారం ప్రైజ్ మనీని అతనితో పంచుకుంటానని తెలిపాడు. ఈ లాట‌రీతో శంతను శెట్టిగర్ బిగ్ టికెట్ చరిత్రలో అతిపెద్ద విజేతల్లో ఒకరిగా నిలిచాడు. ఇదే డ్రాలో మరో ఐదుగురు విజేతలు తలా 1 మిలియన్ దిర్హమ్స్‌తో పాటు ఒక లగ్జరీ కారును కూడా గెలుచుకున్నారు.


UAE Big Ticket Lottery
Shantanu Shettigar
Karnataka youth
Abu Dhabi lottery
Indian expat
Lottery winner
Udupi district
Oman retail job
Big Ticket series 283
20 million dirhams

More Telugu News