Allu Arjun: బన్నీ-అట్లీ మూవీలో క్రేజీ ట్విస్ట్: విలన్‌గా మారనున్న 'శ్రీవల్లి'?

Rashmika Mandanna rumored to play villain in Allu Arjun Atlee movie
షార్ట్స్‌లో చూడండి
‘పుష్ప’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జోడీ మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి వీరిద్దరూ ప్రేమికులుగా కాదు.. ఒకరికొకరు సవాళ్లు విసురుకునే పాత్రల్లో కనిపించబోతున్నారన్న వార్త ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ బహుభాషా చిత్రంలో రష్మిక ఒక కీలక పాత్ర పోషిస్తోంది.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రష్మిక మందన్న ప్రతినాయిక (విలన్) ఛాయలున్న పాత్రలో కనిపించబోతోంది. తన కెరీర్‌లో ఇప్పటివరకు చూడని సరికొత్త కోణంలో ఆమె ఈ పాత్రను పోషిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల టాక్. తాజాగా ఆమె సెట్స్‌లోకి అడుగుపెట్టడంతో ఈ ప్రచారం మరింత బలపడింది.

సైన్స్ ఫిక్షన్ కథాంశంతో సాగే ఈ విజువల్ వండర్‌లో అల్లు అర్జున్ రెండు భిన్నమైన గెటప్స్‌లో అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, భారీ తారాగణం ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 
Go Back to Shorts
Allu Arjun
Allu Arjun Atlee movie
Rashmika Mandanna
Pushpa
Atlee
Sun Pictures
Deepika Padukone
Mrunal Thakur
Janhvi Kapoor
Tollywood

More Telugu News