తారక్ ఒక క్రేజీ, మ్యాడ్ డ్రైవర్: రామ్ చరణ్
- తారక్ డ్రైవింగ్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తానన్న రామ్ చరణ్
- పెద్ది' సినిమా వాయిదా వార్తలను ఖండించిన గ్లోబల్ స్టార్
- ముందు ప్రకటించినట్టు మార్చి 27నే సినిమా విడుదల అని స్పష్టత
ఇదే ఇంటర్వ్యూలో తన తాజా చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీపై వస్తున్న వదంతులకు ఆయన స్పష్టతనిచ్చారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా వాయిదా పడుతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మార్చి 27న ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ధృవీకరించారు. దీంతో సినిమా రిలీజ్‌పై ఉన్న ఊహాగానాలకు తెరపడింది. ఈ చిత్రంలో తాను మునుపెన్నడూ చేయని సరికొత్త పాత్రలో కనిపిస్తానని, జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోందని తెలిపారు.
ఇక, తాను విజయం, అపజయం వంటివాటిని పెద్దగా పట్టించుకోనని, వాటి గురించి ఎక్కువగా ఆలోచించనని చరణ్ పేర్కొన్నారు.