Srikanth Pangarkar: మహారాష్ట్ర ఎన్నికలు... గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడు గెలుపు
- జాల్నా కార్పొరేషన్ నుంచి విజయం సాధించిన శ్రీకాంత్ పాంగార్కర్
- జాల్నాలోని 13వ వార్డు నుంచి పోటీ చేసిన గెలిచిన శ్రీకాంత్
- బీజేపీ సహా అన్ని పార్టీలు బరిలో నిలిచినప్పటికీ గెలిచి స్వతంత్ర అభ్యర్థి
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితలు పలు ఆసక్తికర పరిణామాలకు దారితీశాయి. గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ పాంగార్కర్, జాల్నా కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ను 2017లో బెంగళూరులోని ఆమె నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ కేసులో శ్రీకాంత్‌ను అరెస్టు చేయగా, 2024లో బెయిల్‌పై విడుదలయ్యారు.
జాల్నాలోని 13వ వార్డు నుంచి శ్రీకాంత్ పోటీ చేశారు. ఈ వార్డు నుంచి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ మాత్రమే తమ అభ్యర్థిని నిలపలేదు. బీజేపీతో సహా ఇతర ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి.
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీకాంత్, శివసేన (షిండే) పార్టీలో చేరడానికి ప్రయత్నించగా, పలు అభ్యంతరాలు రావడంతో ఏక్‌నాథ్ షిండే ఆయనను పార్టీలోకి తీసుకోలేదు. 2001-2006 మధ్య జాల్నా మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేసిన శ్రీకాంత్ పాంగార్కర్‌కు 2011లో శివసేన టిక్కెట్ నిరాకరించింది. దీంతో ఆయన హిందూ జనజాగృతి సమితిలో చేరారు.