భోగాపురం కల సాకారం.. ల్యాండైన తొలి విమానం

Bhogapuram Airport First Flight Lands Successfully
షార్ట్స్‌లో చూడండి
విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఇవాళ‌ ఉదయం 10.15 గంటల సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్ ఇక్కడి రన్‌వేపై దిగింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ ఛైర్మన్ తదితరులు ప్రయాణించారు.

అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు పనులు ఇప్పటికే 96 శాతం పూర్తయినట్లు నిర్మాణ సంస్థ జీఎంఆర్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయాన్ని జూన్ 26న అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఈ టెస్ట్ ఫ్లైట్ విజయవంతం కావడంతో త్వరలోనే ఈ ప్రాంతం నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
Go Back to Shorts
Bhogapuram Airport
Rammohan Naidu Kinjarapu
Vizianagaram
Andhra Pradesh Airports
GMR Group
Airport Inauguration
Test Flight
Kalishetti Appalanaidu
Delhi Flight
Civil Aviation

More Telugu News