వివాహ వేడుకలో ఆసక్తికరం.. సరదాగా 8వ వచనం జోడించిన వరుడు
- సంప్రదాయ ఏడు ప్రమాణాలకు ఎనిమిదో వచనం జోడించిన వరుడు
- వధువుతో పాటు సరదాగా నవ్వుకున్న అతిథులు
- ఈరోజు నుంచి ఏసీ ఉష్ణోగ్రతను నేనే నియంత్రిస్తానంటూ సరదా వ్యఖ్య
మయాంక్, దియా జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సాంప్రదాయ ఏడు ప్రమాణాలను వరుడు మయాంక్ వల్లె వేశాడు. ఆ తర్వాత మైక్ తీసుకుని, మరొక వాగ్దానానికి వధువు అంగీకరించాలని కోరాడు. "ఈ రోజు నుంచి మన గదిలో ఏసీ టెంపరేచర్ ను నేనే నియంత్రిస్తాను" అని చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు.