మైనర్లు, మహిళలపై అకృత్యాలు జరిగింది ఇక్కడే.. ఎప్ స్టీన్ ఐలాండ్ లోపల ఎలా ఉందంటే..!
- విలాసతవంతమైన గదులు, కళ్లు చెదిరే సౌకర్యాలు
- సంపన్నుల వికృత క్రీడలకు అనువుగా ఏర్పాట్లు చేసుకున్న ఎప్ స్టిన్
- అమెరికాను కుదిపేసిన ఎప్ స్టీన్ ఫైల్స్ వ్యవహారం
విలాసవంతమైన బెడ్ రూంలు, బాత్ రూంలతో పాటు ఓ డెంటిస్ట్ గది కూడా ఈ ఫొటోలలో కనిపిస్తోంది. గదుల్లో ఖరీదైన రిసార్ట్ వాతావరణాన్ని చూడొచ్చు. భవనం ముందు స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్ వీడియోలో కనిపిస్తోంది. ‘సీ వ్యూ’ను ఎంజాయ్ చేస్తూ సేదదీరేందుకు ఎప్ స్టీన్ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్ స్టీన్ చీకటి సామ్రాజ్యానికి సంబంధించిన ఈ ఫొటోలను విడుదల చేయడం వెనక విచారణలో పారదర్శకత ఉండాలన్నదే తమ ఉద్దేశమని కమిటీ పేర్కొంది. ఎప్ స్టీన్ బాధిత మహిళలకు న్యాయం జరిగేంత వరకూ తమ పోరాటం ఆగదని కమిటీ స్పష్టం చేసింది.