కూతురి పేరు ప్రకటించిన కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా
- చిన్నారికి సరాయాగా నామకరణం
- సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన కియార్, సిద్ధార్థ్
- శుభాకాంక్షలు తెలుపుతున్న అభిమానులు
తమ తమ సోషల్ మీడియా ఖాతాలలో కియారా, సిద్ధార్థ్ ఒకే రకమైన పోస్ట్ చేశారు. ఇందులో వారు తమ కూతురి చిట్టి పాదాలను చేతుల్లోకి తీసుకున్న ఒక అందమైన ఫొటోను షేర్ చేశారు. ఈ పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ ప్రముఖులు, స్నేహితులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి సరాయాకు ఆశీస్సులు అందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త తెలియడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.