మా కుటుంబానికి చెందిన ఈ సినిమా హాల్ అప్పట్లో పెద్ద పొలిటికల్ సెంటర్: సోమిరెడ్డి

Somireddy Emotional Remembering Family Cinema Hall Srinivasa Mahal
  • నెల్లూరులోని శ్రీనివాసమహల్‌తో తమకున్న బంధాన్ని గుర్తుచేసుకున్న సోమిరెడ్డి
  • ఒకప్పుడు తమ సినిమా హాల్ పెద్ద పొలిటికల్ సెంటర్ అని వ్యాఖ్య
  • ప్రస్తుతం ఆ స్థలంలో నిర్మించిన జైన్ మందిరం ప్రారంభోత్సవానికి హాజరు
  • అక్కడ అడుగుపెట్టగానే పాత రాజకీయ జ్ఞాపకాలు గుర్తొచ్చాయని వెల్లడి
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నెల్లూరులోని తమ కుటుంబానికి చెందిన శ్రీనివాసమహల్ సినిమా హాల్ స్థలాన్ని సందర్శించినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఒకప్పుడు రాజకీయాలకు కేంద్రంగా ఉన్న ఆ ప్రదేశంలో అడుగుపెట్టగానే పాత రోజులు గుర్తుకొచ్చాయని ఆయన ఎక్స్ వేదికగా వివరించారు.

"నెల్లూరులోని శ్రీనివాసమహల్ అంటేనే మాకు ఒక ఎమోషన్. మా కుటుంబానికి చెందిన ఈ సినిమా హాల్ అప్పట్లో పెద్ద పొలిటికల్ సెంటర్. ఎందరో రాజకీయ ప్రముఖులకు కేరాఫ్ అడ్రస్. కాలక్రమంలో మా కుటుంబం ఆ సినిమాహాలును విక్రయించగా ప్రస్తుతం జైనులు కొనుగోలు చేసి అపార్టుమెంటు నిర్మించారు. ఆ అపార్టుమెంటు ప్రాంగణంలో నిర్మించిన జైన్ మందిరం ప్రారంభోత్సవానికి పెద్దల ఆహ్వానం మేరకు నేను, మా సోదరుడు శ్రీనివాసులు రెడ్డి వెళ్లాం. అక్కడ అడుగుపెట్టగానే పాతరోజులు గుర్తుకొచ్చాయి. శ్రీనివాసమహల్ కేంద్రంగా చేసిన రాజకీయ కార్యకలాపాల జ్ఞాపకాలను నెమరేసుకున్నాం" అని ట్వీట్ చేశారు.  ఈ మేరకు సోమిరెడ్డి కొన్ని ఫొటోలను కూడా పంచుకున్నారు.
Go Back to Shorts
Somireddy Chandramohan Reddy
Somireddy
TDP
Nellore
Srinivasa Mahal
Political Center
Jain Temple
Andhra Pradesh Politics
Cinema Hall
Memories

More Telugu News