స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
- డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు
- వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం
డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో, డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.