హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు అలర్ట్.. రైలు ప్రయాణ వేళల్లో మార్పులు
- మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు తెలిపిన సంస్థ
- ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లు
- అన్ని టెర్మినళ్లలో అన్ని రోజుల్లో ప్రయాణ సదుపాయం
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అధికంగా ఉండటం వలన ఉద్యోగులు, విద్యార్థులు మరియు నగరవాసులు మెట్రో రైలు ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రయాణికులందరికీ అనుకూలంగా ఉండేలా ఎల్ అండ్ టీ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది.