రాయదుర్గంలో మరోసారి భూముల వేలం.. గజం రూ. 3,10,000...!
- నాలెడ్జ్ సిటీలోని 4,718.22 చదరపు గజాల వేలానికి టీజీఐఐసీ నోటిఫికేషన్
- నవంబర్ 11న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేలం
- ఇటీవల రాయదుర్గంలో రూ. 177 కోట్లు పలికిన ఎకరం భూమి
ఇటీవల రాయదుర్గంలో టీజీఐఐసీ 18.67 ఎకరాలను వేలానికి పెట్టింది. తొలి విడతలో 7.67 ఎకరాలను వేలం వేయగా, ఎకరం భూమి రూ. 177 కోట్లు పలికింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన భూముల వేలంలో ఇది అత్యధిక ధర. 7.67 ఎకరాల భూమిని రూ. 177 కోట్ల చొప్పున రూ. 1,356 కోట్లకు ఎంఎస్ఎం రియాల్టీ సంస్థ దక్కించుకుంది. ఈసారి గజానికి రూ. 3,10,000 అంటే ఎకరాకు రూ. 124 కోట్లుగా వస్తుంది.