ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంటూ భార్య ఐశ్వర్యపై అభిషేక్ పొగడ్తలు
- తన విజయం వెనుక ఐశ్వర్య త్యాగం ఉందన్న నటుడు
- ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అభిషేక్
- అవార్డును తండ్రి అమితాబ్, కూతురు ఆరాధ్యకు అంకితమిచ్చిన హీరో
ఈ అవార్డును కుమార్తె ఆరాధ్యకు, తండ్రి అమితాబ్ కు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ముందు ఈ అవార్డు స్వీకరించడం తనకు రెట్టింపు సంతోషంగా ఉందన్నారు. ‘ఐ వాంట్ టు టాక్’ దర్శకుడికి, తనను 25 ఏళ్లుగా ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. తాను ఎన్నో కష్టాలు దాటుకొని ఈ స్థాయికి వచ్చానని, తనకు అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అభిషేక్ బచ్చన్ చెప్పారు.