విషం తాగడం తప్ప మరో మార్గం లేదంది మా అమ్మ: నటి శ్రీలక్ష్మి
- హాస్యనటిగా శ్రీలక్ష్మికి పేరు
- తమ ఫాదర్ పెద్ద హీరో అని వెల్లడి
- నిర్మాతగా నష్టపోయారని వివరణ
- అనారోగ్యంతో చనిపోయారని ఆవేదన
- ఫ్యామిలీ కోసం సినిమాల్లోకి రావలసి వచ్చిందన్న శ్రీలక్ష్మి
"మా అమ్మానాన్నలకు మేం ఆరుగురు సంతానం. మా నాన్నగారు అమర్ నాథ్ అప్పట్లో హీరోగా చేశారు. అయితే సినిమా నిర్మాణం వలన బాగా నష్టపోయారు. హీరోగా అవకాశాలు తగ్గిన తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా చేయలేకపోయారు ... దానికి తోడు అనారోగ్యం. కుటుంబం గడవడానికి మేం సినిమాలు చేస్తామంటే ఒప్పుకునేవారు కాదు. ఆయన చివరి రోజులలో అంగీకరించారు. 'శుభోదయం' సినిమాతో నేను హీరోయిన్ గా పరిచయం కావలసింది. ఆ సమయంలోనే నాన్న చనిపోవడం వలన ఆ ఛాన్స్ పోయింది" అని అన్నారు.
"నాన్న చనిపోయారు .. ఏడుగురు కుటుంబ సభ్యులం బ్రతకాలి. అందరూ నా తరువాత వారే. 'నువ్వొక్క దానివి నీ జీవితాన్ని త్యాగం చేస్తే, కుటుంబం గడుస్తుంది .. అందరం బ్రతకొచ్చు. లేదంటే అందరం కలిసి తలా ఇంత విషం తాగడం తప్ప మరో మార్గం లేదు' అని మా అమ్మ నాతో అంది. అలాంటి పరిస్థితులలో ఇక నేను మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసి నా కెరియర్ పై మాత్రమే ఫోకస్ చేయవలసి వచ్చింది" అని చెప్పారు.