ఈడీ ఆఫీసుకు చేరుకున్న అనిల్ అంబానీ
- మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు
- 7వేల కోట్ల మోసం కేసులో అధికారుల విచారణ
- ఇటీవల అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసుల జారీ
రిలయన్స్ గ్రూపు సంస్థలపై ఈడీ అధికారులు గత నెల 24న దాడులు చేశారు. మొత్తం 35 ప్రాంతాల్లోని 50 కంపెనీలలో మూడు రోజుల పాటు సోదాలు జరిపారు. పలు కీలక దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం అనిల్ అంబానీకి సమన్లు జారీ చేశారు. పలువురు ఎగ్జిక్యూటివ్‌లకు కూడా నోటీసులు పంపించారు. అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు చేపట్టింది. ఇప్పటికే అనిల్ అంబానీ దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది.