ఫ్యాన్ మూమెంట్... మెగాస్టార్ చిరంజీవితో మౌనిరాయ్... ఫొటో ఇదిగో!
- విశ్వంభర చిత్రంలో స్పెషల్ సాంగ్
- చిరంజీవితో ఆడిపాడిన బాలీవుడ్ ముద్దుగుమ్మ మౌనిరాయ్
- ఇటీవలే షూటింగ్ కంప్లీట్
విశ్వంభర’ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇటీవలే చిరంజీవి, మౌనిరాయ్ పై స్పెషల్ సాంగ్ షూటింగ్ పూర్తయింది. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. గణేశ్ ఆచార్య నృత్యరీతులు సమకూర్చిన ఈ పాటను వందమంది డ్యాన్సర్లతో అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కించారు. చిరంజీవి తన సిగ్నేచర్ స్టెప్స్‌తో అభిమానులను అలరించడం ఖాయమని చిత్రబృందం చెబుతోంది.స
ఈ చిత్రం సత్యలోకం నేపథ్యంలో రూపొందుతోందని, బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకం కథాంశంతో సినిమా తెరకెక్కుతోందని దర్శకుడు వశిష్ట ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
‘విశ్వంభర’ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కథ, రచన, దర్శకత్వం బాధ్యతలను వశిష్ట నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంపై చిరంజీవి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.