సీఎం చంద్రబాబుపై సీఐఐ డైరెక్టర్, టాటా చైర్మన్ ప్రశంసల వర్షం
- ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన
- చంద్రబాబును కలిసి నివేదిక అందించిన స్వర్ణాంధ్రప్రదేశ్-2047' టాస్క్ ఫోర్స్
- చంద్రబాబు ఓ విజనరీ అని పేర్కొన్న సీఐఐ డైరెక్టర్
- హైదరాబాద్ ఐటీలో దూసుకుపోవడానికి చంద్రబాబే కారణమన్న టాటా చైర్మన్
టాటా సన్స్, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కూడా ఇదే అభిప్రాయం వెల్లడించారు. "ఈ రోజు హైదరాబాద్ ఐటీలో దూసుకుపోతుంది అంటే, అది చంద్రబాబు గారి విజన్.. మానవ వనరుల కోసం నాడు ఇంజనీరింగ్ విద్యా సంస్థలు కూడా పెట్టిన విజన్ చంద్రబాబు గారిది. ఆ రోజుల్లో ఐటీ అభివృద్ధి కోసం, మాతో ఉదయం 6 గంటల నుంచే చర్చలు మొదలు పెట్టే వారు. అదీ... చంద్రబాబు గారికి ఉన్న ప్యాషన్" అని చంద్రశేఖరన్ వివరించారు.
ఇవాళ ఢిల్లీలో 'స్వర్ణాంధ్రప్రదేశ్-2047' టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. తాము రూపొందించిన నివేదికను ఆయనకు సమర్పించారు. ఈ కార్యక్రమంలోనే పైవిధంగా స్పందించారు.