భూమికి తిరిగి వచ్చాక వారం రోజులు క్వారంటైన్‌కు శుభాంశు శుక్లా
- ఈ నెల 14న భూమికి తిరిగి రానున్న శుక్లా సహా వ్యోమగాములు
- కాలిఫోర్నియాలో ల్యాండ్ కాగానే క్వారంటైన్‌కు తరలింపు
- వారం రోజుల పాటు వారి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను పర్యవేక్షించనున్న ఇస్రో వైద్యులు
వ్యోమగాములు అంతరిక్షంలో భారరహిత స్థితిని అనుభవించినందున భూవాతావరణానికి వారి శరీరాలు అలవాటు పడేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇస్రోకు చెందిన వైద్యాధికారులు వారం రోజుల పాటు వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను నిరంతరం పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా, అంతరిక్షంలో వ్యోమగాముల శరీరాలపై పడిన ప్రభావాన్ని కూడా వైద్యాధికారులు అధ్యయనం చేయనున్నారు.