Priyanka Chopra: మహేశ్ బాబు సినిమాపై ప్రియాంక చోప్రా కీలక వ్యాఖ్యలు

Priyanka Chopra Comments on Mahesh Babu Movie SSMB29
షార్ట్స్‌లో చూడండి
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. తాను ఈ ఏడాది ఒక భారతీయ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రియాంక చెప్పడంతో, మహేశ్ బాబుతో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ గురించేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు.

వివాహం తర్వాత హాలీవుడ్‌లో స్థిరపడిన ప్రియాంక చోప్రా, ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తాను ఇండియాను, ఇక్కడి సినిమాలను చాలా మిస్ అవుతున్నట్లు తెలిపారు. "ఈ సంవత్సరం నేను ఓ భారతీయ చిత్రంలో నటిస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారతీయ ప్రేక్షకులు నాపై చూపించే ప్రేమ ఎంతో విలువైనది" అని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ షూటింగ్ దశలో ఉంది. అటవీ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌ను రాజమౌళి భారీ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరికొత్త లుక్‌తో, మునుపెన్నడూ చూడని పాత్రలో అలరించనున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే ఇంటర్వ్యూలో, తనకు ఊహ తెలిశాక థియేటర్‌లో చూసిన మొదటి సినిమా మణిరత్నం ‘బొంబాయి’ అని, ఆ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ప్రియాంక గుర్తుచేసుకున్నారు.

Go Back to Shorts
Priyanka Chopra
Mahesh Babu
SSMB29
SS Rajamouli
Telugu cinema
Bollywood
Indian movie
Priyanka Chopra interview
Bombay movie
Indian film industry

More Telugu News