PC Meena Reporting: 'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్' అఫిషియల్ ట్రైలర్ ఇదిగో!

PC Meena Reporting Viratapalem Official Trailer Released
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 నుంచి 'రెక్కీ' వంటి విజయవంతమైన సిరీస్ తరువాత మరో సరికొత్త థ్రిల్లర్‌ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్' పేరుతో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను నేడు (జూన్ 19) విడుదల చేశారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ జూన్ 27 నుంచి జీ5లో ప్రసారం కానుంది.

ఉత్కంఠ రేపుతున్న కథాంశం

ఈ వెబ్ సిరీస్ కథ 1980ల కాలంనాటి విరాటపాలెం అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రామానికి ఓ వింత శాపం ఉంటుంది. అక్కడ ఏ వధువు పెళ్లిపీటల మీదకు వచ్చినా, అదే రోజు మరణిస్తుంటుంది. ఈ కారణంగా దశాబ్దకాలంగా ఆ ఊళ్లో ఒక్క పెళ్లి కూడా జరగదు. దీంతో గ్రామం మొత్తం భయంతో నిశ్శబ్దంగా మారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ (పీసీ) మీనా (అభిజ్ఞ వూతలూరు) ఆ గ్రామానికి బదిలీపై వస్తుంది. అక్కడికి వచ్చాక, ఊరి శాపం గురించి తెలుసుకుని, దాని వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఎదురయ్యే సంఘటనలు ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠకు గురిచేస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. మూఢనమ్మకాలపై ఓ శక్తివంతమైన సందేశంతో పాటు, థ్రిల్లింగ్ అంశాలతో ఈ సిరీస్ ఆకట్టుకోనుందని తెలుస్తోంది.

ఈ వెబ్ సిరీస్ కేవలం ఒక అతీంద్రియ థ్రిల్లర్ మాత్రమే కాదని, భయానికి, సత్యానికి మధ్య జరిగే ఓ పోరాటమని చిత్ర యూనిట్ పేర్కొంది. జూన్ 27 నుంచి జీ5లో ప్రసారం కానున్న 'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్' ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
Go Back to Shorts
PC Meena Reporting
Viratapalem
Zee5
Abhigna Vuthaluru
Charan Lakkiraju
Krishna Poluru
Telugu web series
Thriller series
OTT platform
Supernatural mystery

More Telugu News