జగన్ ర్యాలీలోని కారు ఢీ కొని వృద్ధుడు మృతి
ఈ క్రమంలో ఏటుకూరు బైపాస్ వద్ద నడుచుకుంటూ వెళుతున్న ఓ వృద్ధుడిని జగన్ ర్యాలీలోని ఓ వాహనం ఢీ కొట్టింది. దీంతో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని వృద్ధుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించాడని వైద్యులు తెలిపారు. కాగా, వృద్ధుడిని ఢీ కొట్టినా ర్యాలీ ఆపకుండా వెళ్లిపోవడంతో వైసీపీ నేతలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.