తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
ఇక, శనివారం 87,347 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 39,490 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, ఇవాళ తెల్లవారుజామున భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.