ఇకపై నగదు రహిత లావాదేవీలు మరింత ఫాస్ట్‌గా.. ఎప్పటి నుంచి అంటే..?
- ప్రస్తుతం యూపీఐ లావాదేవీలకు కనీసం 30 సెకన్ల సమయం
- యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పులు చేస్తున్న ఎన్పీసీఐ
- 2025 జూన్ 16 నుంచి 15 సెకన్ల వ్యవధిలోనే నగదు రహిత లావాదేవీలు
ఈ లావాదేవీలు చేయడానికి ప్రస్తుతం కనీసం 30 సెకన్ల సమయం పడుతోంది. ఈ సమయాన్ని తగ్గించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్లో కొన్ని కీలక మార్పులు చేయనున్నట్లు ఎన్పీసీఐ ప్రకటించింది.
ఈ తాజా అప్డేట్ జూన్ 16 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. దీని ద్వారా యూపీఐ లావాదేవీలు మరింత సులభతరం అవుతాయి. ప్రస్తుతం ఆన్లైన్ చెల్లింపులకు 30 సెకన్ల సమయం పడుతుండగా, అది 15 సెకన్లకు పరిమితం కానుంది. లావాదేవీ స్థితిని తనిఖీ చేసే సమయాన్ని 30 సెకన్ల నుంచి 10 సెకన్లకు తగ్గించనున్నారు. దీనివల్ల డిజిటల్ చెల్లింపులకు సంబంధించి వినియోగదారులకు సమయం ఆదా అవుతుంది.