జమ్మూకశ్మీర్ జైళ్లపై దాడికి ఉగ్రవాదుల స్కెచ్!
- ఉగ్రవాదులను విడిపించుకోవడానికి ప్లాన్
- అధికారులను అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్ వర్గాలు
- జైళ్ల వద్ద భద్రతను భారీగా పెంచిన ప్రభుత్వం
ఈ క్రమంలోనే జైళ్లపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ జైళ్ల భద్రతను పర్యవేక్షిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అప్రమత్తమైంది. జైళ్ల భద్రతపై సీఐఎస్ఎఫ్ డీజీ ఇటీవల శ్రీనగర్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జైళ్ల వద్ద భద్రతను భారీగా పెంచాలని నిర్ణయించి ఆ మేరకు చర్యలు తీసుకున్నారు.