పహల్గామ్ ఉగ్రదాడి... కీలక నిర్ణయం తీసుకున్న ఎల్ఐసీ
- పహల్గామ్ లో టెర్రరిస్టుల దుశ్చర్య
- 26 మంది మృతి
- డెత్ క్లెయిమ్లఉ వేగంగా పరిష్కరించేందుకు ఎల్ఐసీ ప్రత్యేక ఏర్పాట్లు
ఈ దుర్ఘటన పట్ల ఎల్ఐసీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. "పహల్గామ్ లో అమాయక పౌరుల మరణం పట్ల తీవ్రంగా చింతిస్తున్నాం. మరణించిన వారి డెత్ క్లెయిమ్‌లను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి, బాధిత కుటుంబాలకు అండగా నిలవడానికి ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తున్నాం" అని ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ సిద్ధార్థ మొహంతి 'ఎక్స్' ఖాతా ద్వారా తెలిపారు. దుఃఖంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలబడతామని ఆయన భరోసా ఇచ్చారు.
ఎల్ఐసీ ప్రకటించిన దాని ప్రకారం, డెత్ క్లెయిమ్ ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. క్లెయిమ్ చేయాలనుకునే నామినీలు, పాలసీదారు మరణానికి సంబంధించిన అవసరమైన పత్రాలతో, పాలసీని జారీ చేసిన ఎల్ఐసీ బ్రాంచ్‌ను నేరుగా సంప్రదించాల్సి ఉంటుంది.
పాలసీ ప్రీమియంలు సక్రమంగా చెల్లిస్తూ, పాలసీ యాక్టివ్‌గా ఉన్నట్లయితే లేదా గ్రేస్ పీరియడ్‌లోపు మరణం సంభవించినట్లయితే, క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు అర్హత ఉంటుందని ఎల్ఐసీ తెలిపింది. అవసరమైన పత్రాలను పరిశీలించిన అనంతరం, ఎల్ఐసీ క్లెయిమ్ మొత్తాన్ని త్వరితగతిన పరిష్కరిస్తుంది. ఈ చర్య ద్వారా బాధిత కుటుంబాలకు కొంత ఊరట కల్పించాలని ఎల్ఐసీ భావిస్తోంది.