ఎస్ఎల్‌బీసీ సొరంగంలో డేంజర్ జోన్‌లో వ్యర్థాల తొలగింపు కోసం ప్రయత్నాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎస్ఎల్‌బీసీ సొరంగంలో డేంజర్ జోన్‌లో వ్యర్థాల తొలగింపు కోసం ప్రయత్నాలు!

SLBC Tunnel Debris Removal Efforts in Danger Zone
  • డేంజర్ జోన్‌కు సమీపంలో సహాయక చర్యలు
  • సొరంగం మార్గంలో 281 మీటర్ల మేర రాళ్లు, మట్టి తొలగింత
  • దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది సహకారంతో బోరింగ్ యంత్ర భాగాల తొలగింత
ఎస్ఎల్‌బీసీ సొరంగం డేంజర్ జోన్‌కు సమీపంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సొరంగంలో రెండు నెలలుగా సహాయక చర్యలు కొనసాగుతుండగా, డేంజర్ జోన్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులు, సహాయక సిబ్బంది నిరంతరం చర్చిస్తున్నారు.

సొరంగం మార్గంలో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లతో పాటు ప్రమాద సమయంలో ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ యంత్ర భాగాలను ఇదివరకే వెలికి తీశారు. అక్కడి నుంచి మరో 43 మీటర్లను డేంజర్ జోన్‌గా గుర్తించారు. ఈ డేంజర్ జోన్‌లోని వ్యర్థాలను తొలగించేందుకు అనుసరించాల్సిన మార్గాలను అన్వేషిస్తున్నారు.

డేంజర్ జోన్ సమీపంలో భారీగా నీరు వస్తోందని, దీనిని మోటార్లతో బయటకు తోడేస్తున్నామని సహాయక బృందం ప్రత్యేక అధికారి శివశంకర్ తెలిపారు. సొరంగం కూలిన ప్రదేశంలో అక్కడక్కడా మిగిలిపోయిన టన్నెల్ బోరింగ్ యంత్ర భాగాలను దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది సహకారంతో తొలగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Advertisement
SLBC Tunnel
Tunnel Collapse
Debris Removal
Danger Zone
Rescue Operations
Railway Accident
Shivasankar
South Central Railway
Tunnel Boring Machine
Waste Disposal

More Telugu News