Telangana Government: ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు

Telangana Extends LRS Scheme Deadline
షార్ట్స్‌లో చూడండి
లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) రాయితీ గడువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ రాయితీ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

ఎల్ఆర్ఎస్ రుసుమును 25 శాతం రాయితీతో చెల్లించేందుకు మార్చి 31వ తేదీ వరకు మొదట గడువు ఇచ్చింది. తాజాగా ఈ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది.

రాయితీపై ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించినప్పటికీ ఆశించిన స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రజల నుంచి స్పందన ప్రభుత్వం అనుకున్నంతగా రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Go Back to Shorts
Telangana Government
LRS Scheme
Layout Regularization Scheme
LRS Deadline Extension
Property Registration
Telangana Land Regularization
Real Estate Telangana

More Telugu News