ఆసియాలోనే అతిపొడవైన రోప్ వే సిమ్లాలో.. గంటకు 2 వేల మంది ప్రయాణం
- ఇప్పటికే ప్రారంభమైన పనులు
- మాతా తారాదేవి-సంజౌలి మధ్య నిర్మాణం
- పొడవు 13.79 కిలోమీటర్లు
- రూ. 1,734.40 కోట్ల వ్యయంతో నిర్మాణం
ఈ రోప్‌వే మాతా తారాదేవి-సంజౌలి మధ్య నడుస్తుంది. సిమ్లా, సమీప ప్రాంతాల్లోని 15 కీలక స్టేషన్లను ఇది కలుపుతుంది. ప్రతి గంటకు దాదాపు 2వేల మంది.. రెండు వైపుల నుంచి ప్రయాణించే వీలు కలుగుతుంది. ఈ రోప్‌వేలో మొత్తం 660 కేబిన్లు ఉంటాయి. ఒక్కో కేబిన్‌లో 8 నుంచి 10 మంది వరకు ప్రయాణించవచ్చు. ప్రతి రెండుమూడు నిమిషాలకు క్యాబిన్లు స్టేషన్లకు చేరుకుంటాయి. కాగా, ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోప్‌వే బొలీవియాలో ఉంది. దీని పొడవు దాదాపు 32 కిలోమీటర్లు.