Nani: 'హిట్‌-3' నుంచి కొత్త పోస్ట‌ర్‌... ఊరమాస్ లుక్‌లో కిర్రాక్‌గా నాని

Nanis Killer Look in HIT The Third Case New Poster
  • నాని, శైలేశ్‌ కొలను కాంబోలో 'హిట్: ది థర్డ్ కేస్'
  • ఈ మూవీ నుంచి కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన నేచుర‌ల్ స్టార్‌
  • చేతిలో స్టైలిష్‌గా గన్ పట్టుకుని సిగరెట్ కాలుస్తూ ఊరమాస్ లుక్‌లో నాని ద‌ర్శ‌నం
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శైలేశ్‌ కొలను కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం 'హిట్: ది థర్డ్ కేస్'. మే 1న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి సోష‌ల్ మీడియా వేదిక‌గా నాని మరో కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో చేతిలో స్టైలిష్‌గా గన్ పట్టుకుని సిగరెట్ కాలుస్తూ నాని ఊరమాస్ లుక్‌లో కిర్రాక్‌గా కనిపిస్తున్నాడు. ఈ పోస్ట‌ర్‌కు ‘లోడెడ్ అండ్ కుక్‌డ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చి, మరో 30 రోజుల్లో హిట్‌-3 వస్తుందని పేర్కొన్నారు. 

ఇక ఈ సినిమాలో శైలేశ్‌ కొలను హీరో నానిని విభిన్నంగా చూపించబోతున్నారు. ఇప్పటికే కశ్మీర్ ప్రాంతంలో కీలక సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఇందులో నాని పవర్‌ ఫుల్‌ పోలీస్ ఆఫీసర్ అర్జున్‌ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు. నాని సొంత బ్యానర్ వాల్‌పోస్టర్‌ సినిమాతో కలిసి యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

More Telugu News

Nani
HIT The Third Case
Hit 3
Nani new poster
Shailesh Kolanu
Srileela
Telugu Movie
Tollywood
Action Movie
Upcoming Telugu Film