హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంపు
- రేపటి నుంచి అమల్లోకి రానున్న పెరిగిన ఛార్జీలు
- కిలోమీటరుకు 10 పైసల నుంచి 70 పైసల వరకు పెంపు
- ఓఆర్ఆర్పై టోల్ వసూలు చేస్తోన్న ఐఆర్బీ ఇన్ఫ్రా
మినీ బస్ మరియు ఎల్సీవీలకు 20 పైసలు పెంచారు. ఈ వాహనాలకు కిలోమీటరుకు ఛార్జీ రూ.3.77 నుంచి రూ.3.94కు పెరుగుతుంది. డబుల్ యాక్సిల్ బస్సులకు కిలోమీటరుకు రూ.6.69 నుంచి రూ.7కు పెంచారు. భారీ వాహనాలకు రూ.15.09 నుంచి రూ.15.78కి పెంచారు.
ఓఆర్ఆర్ పై ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ టోల్ వసూలు చేస్తోంది. పెరిగిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి.