విరాట్ కోహ్లీ పోలికలతో అచ్చుగుద్దినట్లు తుర్కియే నటుడు కావిట్ సెటిన్ గునెర్

Turkish Actor Looks Exactly Like Virat Kohli
  • విరాట్ కోహ్లీ పోలికలతో మరో వ్యక్తి 
  • తుర్కియే నటుడు కావిట్ సెటిన్ గునెర్ ఫోటో చూసి ఆశ్చర్యానికి గురైన అభిమానులు
  • తుర్కియే కోహ్లీగా అభివర్ణిస్తూ కామెంట్స్ 
ప్రపంచంలో ఒకే పోలికలతో ఏడుగురు వ్యక్తులు ఉంటారనే నానుడి ఉంది. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ విషయంలో ఇది నిజమయ్యేలా ఉంది. ఇదివరకే ఇద్దరు వ్యక్తులు కోహ్లీని పోలి ఉండటం గమనార్హం.

గతంలో కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అచ్చం కోహ్లీలా ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కార్తీక్ శర్మ.. విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగాడు. ఆ తర్వాత అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనూ కోహ్లీని పోలిన వ్యక్తి కనిపించాడు. తాజాగా విరాట్ కోహ్లీలా ఉన్న వ్యక్తి ఒకరు నెటిజన్ల కంట పడటంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ వ్యక్తి కూడా సెలబ్రిటీ కావడం విశేషం. అయితే అతను భారతీయుడు కాదు.

విరాట్ కోహ్లీని పోలిన వ్యక్తి తుర్కియేకి చెందిన నటుడు సెవిన్ గునెర్. తుర్కియేలో ప్రఖ్యాత సిరీస్ 'దిరిలిస్: ఎర్టుగ్రుల్'లో కావిట్ సెటిన్ నటించాడు. ఆ సిరీస్‌లోని ఒక సన్నివేశంలో కావిట్ ఉన్న స్క్రీన్ షాట్‌ను ఓ రెడిట్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. "అనుష్క శర్మ భర్త టీవీ రంగప్రవేశం" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు, కోహ్లీ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కోహ్లీ టీవీ సిరీస్‌లో నటిస్తున్నాడా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

"అతను కోహ్లీ కాదు అని నాతో చెప్పకండి" అని ఒక యూజర్ కామెంట్ చేయగా, మరికొందరు "తుర్కియే కోహ్లీ" అని కామెంట్ చేశారు. కావిట్ సెటిన్ ప్రధాన పాత్రలో నటించిన 'దిరిలిస్ ఎర్తుగ్రుల్' సిరీస్ మొదటి సీజన్ 2014లో విడుదలై విజయవంతం అయింది. దీంతో మరో నాలుగు సీజన్లు రూపొందించారు. 2019లో చివరి సీజన్ విడుదలైంది. కోహ్లీ పోలికలతో ఉన్న కావిట్ సెటిన్‌ను చూడాలనుకునేవారు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌ను చూడవచ్చు. 
Go Back to Shorts
Virat Kohli
Kavitt Cetin Guner
Turkish Actor
Dirilis Ertugrul
Anushka Sharma
Lookalike
Social Media
Netflix
Celebrity Doppelganger
India vs Bangladesh

More Telugu News