బెట్టింగ్ యాప్ కేసుపై విజయ్ దేవరకొండ టీమ్ వివరణ
- ప్రముఖుల మెడకు చుట్టుకుంటున్న బెట్టింగ్ యాప్ ల వ్యవహారం
- ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలపై కేసు
- విజయ్ దేవరకొండ అనుమతులు ఉన్న సంస్థలకే ప్రచారం చేశారన్న టీమ్
- రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని వివరణ
అనుమతి ఉన్న ఏ23 అనే సంస్థ తరఫున విజయ్ దేవరకొండ పనిచేశారని వివరించింది. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిందని వెల్లడించింది. ఏ23 సంస్థతో విజయ్ దేవరకొండ ఒప్పందం గత సంవత్సరమే ముగిసిందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏ23సంస్థతో విజయ్ దేవరకొండకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.