యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలి ఏర్పాటు: మంత్రి కొండా సురేఖ
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- 18 మంది సభ్యులతో వైటీడీ ట్రస్టు బోర్డు ఏర్పాటు
- వారికి జీతభత్యాలు ఉండవన్న మంత్రి కొండా సురేఖ
- ఐఏఎస్ అధికారి ఈవోగా వ్యవహరిస్తారని వెల్లడి
వైటీడీకి బడ్జెట్ ఆమోదం ప్రభుత్వం ద్వారా జరుగుతుందని మంత్రి తెలిపారు. ఐఏఎస్ అధికారి ఈవోగా ఉంటారని వెల్లడించారు. వైటీడీ బోర్డు విద్యా సంస్థలను స్థాపించవచ్చు, నిర్వహించవచ్చని తెలిపారు. యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక, వేద పాఠశాలలను స్థాపించుకోవచ్చని తెలిపారు.
గతంలో యాదగిరిగుట్ట భక్తులకు సరైన వసతులు లేవని ఆమె అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం వసతులను ఏర్పాటు చేసిందని తెలిపారు. యాదగిరిగుట్టను మరింత మెరుగుపరిచేందుకే పాలక మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏటా రూ. 100 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు.