ఎట్టకేలకు లొంగిపోయిన బోరుగడ్డ అనిల్
- చంద్రబాబు, పవన్ కుటుంబ సభ్యులను దూషించిన కేసులో మధ్యంతర బెయిలుపై వున్న బోరుగడ్డ
- నిన్న సాయంత్రం 5 గంటలతో ముగిసిన మధ్యంతర బెయిలు గడువు
- అయినా లొంగిపోకపోవడంతో ఉత్కంఠ
- ఈ ఉదయం మీడియా కంట పడకుండా జైలులో లొంగుబాటు
తల్లి అనారోగ్యం పేరుతో బెయిలు పొడిగించుకునేందుకు అనిల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మధ్యంతర బెయిలును పొడిగించే ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మంగళవారం (11న) సాయంత్రం 5 గంటల్లోపు లొంగిపోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయినప్పటికీ అజ్ఞాతం వీడకపోవడంతో లొంగిపోతాడా? లేదా? అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఆయన మీడియా కంట పడకుండా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకుని జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయాడు.