లోయలో పడిన ట్రక్కు .. ముగ్గురు బీఎస్ఎఫ్ జవానుల మృతి
- లోయలో పడిన సైనికుల వాహనం
- మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలో ఘటన
- అక్కడికక్కడే ఇద్దరు, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరి మృతి
సైనికులతో వెళుతున్న ట్రక్ అదుపుతప్పి లోయలో పడిపోవడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు.
ఈ ఘటనపై మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.