జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

Fire accident in Jeedimetla industrial area
  • సుభాష్ నగర్‌లో ప్లాస్టిక్ ట్రే గోదాంలో చెలరేగిన మంటలు
  • మంటలు ఎగిసిపడి దట్టంగా అలుముకున్న పొగలు
  • ఫైరింజన్లతో మంటలను ఆర్పివేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుభాష్‌నగర్‌లో ప్లాస్టిక్ ట్రే గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడటంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తోంది.

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరిగినట్లు వివరాలు వెల్లడి కాలేదు. 

మంటలు అంటుకున్నాయని గుర్తించిన కార్మికులు వెంటనే బయటకు పరుగెత్తుకుంటూ వచ్చారని పోలీసులు తెలిపారు. స్థానికులు ఈ ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారని వెల్లడించారు. గోదాంలో ఉన్న ప్లాస్టిక్, ఫైబర్ అన్నీ మంటల్లో కాలిపోయాయని తెలిపారు.
Go Back to Shorts
Hyderabad
Fire Accident
Telangana

More Telugu News