MLA vemula veeresham: ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

Nakirekal Mla Vemula Veeresham Got Cyber Threat with nude call
  • డబ్బులు ఇవ్వాలంటూ సైబర్ నేరస్థుల బెదిరింపులు
  • ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో కార్యకర్తలకు వీడియో పంపించిన వైనం
  • నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ఘటన
సైబర్ నేరస్థులు ఏకంగా ఓ ఎమ్మెల్యేకే న్యూడ్ కాల్ చేసి బెదిరింపులకు దిగారు. అడిగిన డబ్బులు ఇవ్వకుంటే వీడియోను వైరల్ చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో వీడియోను కార్యకర్తలకు పంపించారు. నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇటీవల కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఆయన ఫోన్ కు వీడియో కాల్ వచ్చింది. ఆన్సర్ చేయగానే ఓ అమ్మాయి న్యూడ్ గా కనిపించడంతో ఎమ్మెల్యే వెంటనే కాల్ కట్ చేశారు. అప్పటికే వీడియో రికార్డ్ చేసిన దుండగులు.. ఆ క్లిప్ ను ఎమ్మెల్యేకు పంపించి డబ్బులు డిమాండ్ చేశారు.

ఈ హెచ్చరికలను ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టించుకోలేదు. దీంతో సైబర్ నేరస్థులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులకు ఆ వీడియో క్లిప్ ను పంపించారు. కార్యకర్తలు ఫోన్ చేసి చెప్పడంతో అవాక్కయిన ఎమ్మెల్యే.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
MLA vemula veeresham
Nude Call
Cybercrime
Video Clip

More Telugu News