Jagan: ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు... చంద్రబాబు, జగన్ సీట్లు ఎక్కడంటే...!

Seats allocation to MLAs in AP Assembly
షార్ట్స్‌లో చూడండి
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. సీట్ల కేటాయింపుకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు శాసనసభలో ప్రకటన చేశారు. ట్రెజరీ బెంచ్ కు ముందు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లు కేటాయించారు. 

వీరి తర్వాత చీఫ్ విప్, విప్ లకు... ఆ తర్వాత సీనియారిటీ ప్రకారం ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు 1వ నెంబర్ సీట్ ను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు 39వ నెంబర్ సీటును కేటాయించినట్టు డిప్యూటీ స్పీకర్ తెలిపారు. వైసీపీ శాసనసభాపక్ష నేత జగన్ కు ప్రతిపక్ష బెంచ్ లో ముందు వరుస సీట్ ను కేటాయించారు. 
Go Back to Shorts
Jagan
YSRCP
AP Assembly
Seats

More Telugu News